: యాసిన్ భత్కల్ ను అప్పగించలేం... రాజస్థాన్ కు తేల్చిచెప్పిన ఎన్ఐఏ కోర్టు!
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలన్న రాజస్థాన్ పోలీసుల వినతిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం తిరస్కరించింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు చివరి దశకు వచ్చేదాకా భత్కల్ పై పీటీ వారెంట్ జారీ చేయలేమని కూడా కోర్టు రాజస్ధాన్ పోలీసులకు స్పష్టం చేసింది. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.