: మోదీపై రాజీవ్ తరహా ఆత్మహుతి దాడి... ఐబీ హెచ్చరిక


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పథకం రచించారా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ రాజధాని పాట్నా, ముజఫర్ పూర్ లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన ఆత్మాహుతి దాడి తరహాలోనే మోదీపై కూడా విరుచుకుపడాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారట. జర్నలిస్టు, రాజకీయ నేత, ఎలక్ట్రీషియన్, వంటవాడు, కూలీ తదితర ఏదో ఒక రూపంలో వచ్చే ఉగ్రవాదులు మోదీపై దాడి చేసే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీతో పాటు బీహార్ పోలీసులను కూడా ఐబీ హెచ్చరించింది.

  • Loading...

More Telugu News