: మధ్యాహ్నంలోగా హాస్టళ్లను ఖాళీ చేయండి... విద్యార్థులకు నాగార్జున వర్సిటీ ఆదేశం


బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయాన్ని కుదిపేసింది. సీనియర్ల వేధింపుల కారణంగా బలవన్మరణం చెందిన రిషికేశ్వరి రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. వర్సిటీలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి అధికారుల సమక్షంలోనే పరస్పర దాడులు చేసుకున్నారు. రిషికేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు తెర లేపారు. ఈ క్రమంలో వర్సిటీకి 10 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ ఇన్ చార్జీ వీసీ సాంబశివరావు నిన్న నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక నేటి మధ్యాహ్నం 12 గంటల్లోగా హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆయన విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News