: మూడు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉంటా: క్రిస్ గేల్
మూడు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండనున్నానని వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తెలిపాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్న గేల్, ఐపీఎల్ సీజన్ 8, అనంతరం విండీస్ లో జరిగిన కొన్ని మ్యాచ్ లలో విరామం తీసుకున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికల్లా పూర్తి ఫిట్ గా ఉండాలని భావిస్తున్నాడు. ఈ నేఫథ్యంలో వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మూడు నెలలు క్రికెట్ కు తాత్కాలిక విరామం తీసుకోనున్నాడు. 'వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకుంటున్నా, రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది, ఈ కాస్త సమయం క్రికెట్ కు దూరంగా ఉండనున్నా, మళ్లీ డిసెంబర్ లో వస్తా' అంటూ గేల్ ట్వీట్ చేశాడు.