: వేదికపై కుప్పకూలిన బీహార్ మాజీ మంత్రి... ఆసుపత్రికి తరలించే లోపే మృతి


బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ నేత ఆనంద్ మోహన్ సింగ్ (60) ఓ కార్యక్రమంలో వేదికపై కుప్పకూలిపోయి మృతి చెందారు. పట్నాలో నోనియా కాస్ట్ మహాసంఘ్ కార్యక్రమానికి హాజరైన ఆనంద్ వేదికపై కుప్పకూలి స్పృహ తప్పిపడిపోయారు. దీంతో వేదికపై ఉన్నవారు ఆయనను హుటాహుటీన పట్నా మెడికల్ కళాశాలకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రోహ్ తాస్ జిల్లాలో నోఖా ప్రాంతానికి చెందిన ఆనంద్ 1997లో లాలూప్రసాద్ యాదవ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News