: సానియా దంపతుల డ్యాన్సు బాగా లేదంటూ యువీ ట్వీట్... చాలెంజ్ చేసిన షోయబ్


భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్ డబ్ స్మాష్ వీడియోలో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను ఊపేశారు. భర్తతో కలిసి సానియా చేసిన ఆ డ్యాన్సుకు విశేష స్పందన లభించింది. ఆ డబ్ స్మాష్ క్లిప్ పై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఆ డ్యాన్సేమీ బాగోలేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. సానియా, షోయబ్ మంచి ప్లేయర్లేనని, అయితే, వారి డ్యాన్స్ మాత్రం భయంకరంగా ఉందని ట్వీట్ చేశాడు. దీనికి షోయబ్ మాలిక్ ట్విట్టర్లో స్పందించాడు. యువీ... గ్రౌండ్ లోకి రా! చూసుకుందాం! అంటూ సరదాగా సవాల్ విసిరాడు. వింబుల్డన్ టైటిల్ నెగ్గిన అనంతరం విరామం దొరకడంతో సానియా మీర్జా శ్రీలంక వెళ్లింది. అప్పటికే అక్కడ పాకిస్థాన్ జట్టు సిరీస్ ఆడుతోంది. పాక్ జట్టులో షోయబ్ మాలిక్ కూడా సభ్యుడన్న సంగతి తెలిసిందే. దీంతో, భర్త వద్దకు చేరుకున్న సానియా అక్కడ జాలీగా గడిపింది.

  • Loading...

More Telugu News