: ములాయంకు క్లీన్ చిట్ ఇచ్చిన యూపీ పోలీసులు
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ చేసిన ఫిర్యాదును యూపీ పోలీసులు తిరస్కరించారు. ములాయం సింగ్ యాదవ్ తనను బెదిరించారంటూ కొంత కాలం క్రితం అమితాబ్ ఠాకూర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అత్యాచార యత్నం కేసు నమోదైంది. అనంతరం ఆయనను ఉద్యోగం నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే అమితాబ్ ఠాకూర్ ను ములాయం సింగ్ యాదవ్ బెదిరించినట్టు ఆధారాలు లేవని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. అంతేకాక ఆయనపై అమితాబ్ ఠాకూర్ పెట్టిన కేసు చెల్లదంటూ వారు స్పష్టం చేశారు.