: నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను!: సల్మాన్ ఖాన్


'భజరంగీ భాయ్ జాన్' సినిమా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఈ సినిమా చూసిన అనంతరం... సుజీ అనే చిన్నారి 'సల్మాన్ తనకు కావాలని, సల్మాన్ అంటే తనకు చాలా ఇష్టమని' భోరున ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావని వాళ్ల అమ్మ అడిగితే 'ఐ లవ్యూ సల్మాన్' అని చెప్పింది. దీనిని వీడియో తీసిన ఆ కుటుంబం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇది సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని వీక్షించిన సల్లూభాయ్ దీనిపై ట్విట్టర్లో స్పందించాడు. 'నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా'నంటూ సల్మాన్ ఈ వీడియోను షేర్ చేశాడు.

  • Loading...

More Telugu News