: నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న పాక్... చైనా నుంచి 8 జలాంతర్గాముల కొనుగోలు


తన నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో పాక్ ముందడుగు వేసింది. ఏకంగా 8 జలాంతర్గాములను చైనా నుంచి కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని... ఈ ఒప్పందం విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని పాక్ మీడియా వెల్లడించింది. ఇస్లామాబాద్ లో జరిగిన సమావేశంలో పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్, చైనాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ అధ్యక్షుడు జు జిక్విన్ లు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలపై బీజింగ్ లో ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష జరిపి, ఖరారు చేస్తారు. కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో పాక్ చెల్లిస్తుంది.

  • Loading...

More Telugu News