: రూ. 22,500కు చేరిన ఆభరణాల బంగారం ధర
బంగారం ధరలు మరింతగా తగ్గాయి. గురువారం నాడు కాస్తంత కొనుగోలు మద్దతుతో స్వల్పంగా పెరిగిన ధరలు, తిరిగి అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం నాడు తగ్గాయి. దేశవాళీ బులియన్ మార్కెట్లో, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 200 తగ్గి, రూ. 24,541కి చేరగా, ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ. 22,496కు చేరింది. వెండి ధర కిలోకు రూ. 150 తగ్గి రూ. 33,722కు పడిపోయింది. ఇక శనివారం నాడు హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గి రూ. 25,550 వద్ద, ఆర్నమెంటు బంగారం ధర రూ. 23,820 వద్ద, వెండి కిలోకు రూ. 34 వేల వద్దకు చేరాయి. ధరలింకా పతనం కావచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు.