: యూపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన సల్మాన్ ఖాన్


బజరంగీ భాయిజాన్ చిత్రానికి ఉత్తరప్రదేశ్ సర్కారు పన్ను మినహాయింపు ఇవ్వడంపై హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. పన్ను రాయితీ ప్రకటించినందుకు యూపీ ప్రభుత్వానికి సల్మాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బజరంగీ... దర్శకుడు కబీర్ ఖాన్ ఇటీవలే సీఎం అఖిలేశ్ యాదవ్ ను కలిసి చిత్ర విశేషాలను వివరించారు. కబీర్ తో భేటీ అనంతరం ఆ సినిమాకు రాష్ట్రంలో పన్ను మినహాయింపునిస్తున్నట్టు అఖిలేశ్ ప్రకటించారు. కాగా, తమ సినిమాను చూడాల్సిందిగా కబీర్ ఖాన్ రాజకీయనేతలను కోరారు.

  • Loading...

More Telugu News