: ఈ ప్రభుత్వంలో పనిచేయలేను...యూపీ ప్రభుత్వంపై ఈసారి ఐఏఎస్ తిరుగుబాటు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఈసారి ఐఏఎస్ అధికారి తిరుగుబావుటా ఎగురవేశారు. ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ వివాదం సమసిపోకముందే ఐఏఎస్ తిరుగుబాటు చేయడం విశేషం. ఈ ప్రభుత్వంలో పనిచేయలేను, స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇవ్వాలంటూ 1982 ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్ ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అలోక్ రాజన్ కు లేఖ రాశారు. అదే లేఖను ఆయన ఫేస్ బుక్ లో పెట్టారు. వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు రాష్ట్ర ప్రజల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన యూపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.