: హెచ్ఆర్సీలో తెలంగాణ పురపాలక ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఫిర్యాదు


సమ్మెలో పాల్గొన్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం తొలగించడంపై తెలంగాణ పురపాలక ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. తొలగించిన కార్మికులను విధుల్లోకి చేర్చుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విన్నవించింది. ఈ మేరకు మానవహక్కుల కమీషన్ ఛైర్మన్ కు జేఏసీ వినతిపత్రాన్ని సమర్పించింది. జీతాలు పెంచాలంటూ ఇటీవల రెండు వారాల పాటు కార్మికులు చేసిన సమ్మెతో ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలించి జీతాలు పెంచింది. కానీ, సమ్మెలో పాల్గొన్న కొంతమంది కార్మికులను మాత్రం విధుల నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News