: భవనంపై నుంచి తోసేసి, చావలేదని రాళ్లతో కొట్టి..!


తాము శిక్షించాలనుకున్న వారిని వివిధ మార్గాల్లో కిరాతకంగా చంపేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరో రకమైన పైశాచికాన్ని ప్రదర్శించారు. సిరియాలోని హోమ్స్ నగరంలో ఇద్దరు యువకులను స్వలింగ సంపర్కులుగా ఆరోపిస్తూ, వారి చేతులను వెనక్కు కట్టేసి, ఓ భవంతిపై నుంచి కిందకు పడేశారు. ఆపై తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేశారు. చనిపోయే వరకూ రాళ్లతో కొట్టారు. దీన్ని వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. బహిరంగ శిక్షలను విధించినప్పుడు వీడియోలను విడుదల చేయవద్దంటూ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇటీవల ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ వీడియో బహిర్గతం కావడం గమనార్హం. గత నెలలో సైతం ఇవే ఆరోపణలపై ఇద్దరు యువకులకు ఉగ్రవాదులు ఇదే శిక్ష విధించారు.

  • Loading...

More Telugu News