: పుట్టుకతోనే ఆయనో మోసగాడు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టుకతోనే దిగ్విజయ్ ఓ మోసగాడని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నేతలు ఎల్లప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన మాటల దాడి చేశారు. ఓ రైతు కుమారుడినైన తాను సీఎం కావడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతల అక్రమాలను బయటపెడతానని హెచ్చరించారు. వ్యాపం స్కాం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించిన తరువాత మొదటిసారి చౌహాన్ ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ స్కాంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ దిగ్విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే.