: ఒవైసీ వ్యాఖ్యలపై సాక్షీ మహరాజ్ ఘాటు స్పందన... కౌంటరిచ్చిన రేణుకా చౌదరి!


ఉగ్రవాది యాకూబ్ మెమన్ ను ఎందుకు ఉరికంబం ఎక్కిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, ఇండియా చట్టాలను, కోర్టు తీర్పులను గౌరవించలేని వారు పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని బీజేపీ నేత సాక్షీ మహరాజ్ వ్యాఖ్యానించారు. అటువంటి వారికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. తన ఫేస్ బుక్ పేజీలో అసదుద్దీన్, మెమన్ ను పోలీసులు అరెస్ట్ చేయలేదని, తనంతట తానే లొంగిపోయాడని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. 1993 నాటి పేలుళ్ల వెనుక పాకిస్థాన్ హస్తముందని తేలిన తరువాత కూడా మెమన్ ను ఉరితీయడమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా, సాక్షీ మహరాజ్ వ్యాఖ్యల తరువాత, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా స్పందించారు. సాక్షీ మహరాజ్ ను విదేశాంగ శాఖలో కూర్చోబెట్టాలని, అప్పుడాయన ఎవరిని పాకిస్థాన్ పంపాలో నిర్ణయించుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News