: చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం!
పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు లాంచీలో వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన వెళ్తున్న లాంచీ ప్రమాదవశాత్తూ, మరో బోటును ఢీకొంది. అయితే, ఈ ఘటనతో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. లాంచీలో చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణలతో పాటు పలువురు అధికారులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. ఎవరికీ కూడా ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. సీఎం ప్రయాణిస్తున్న లాంచీ దగ్గరికి బోటు ఎందుకు వెళ్లిందన్న విషయంపై సమాచారం అందాల్సివుంది.