: మంత్రాలయంలో రాజమౌళి సందడి
'బాహుబలి' సినిమాతో ఇమేజ్ ను మరింత పెంచుకున్న దర్శకుడు రాజమౌళి శుక్రవారం కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం విచ్చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్, సోదరుడు ఎంఎం కీరవాణితో కలిసి ఇక్కడికి వచ్చిన జక్కన్న రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. రాజమౌళికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, తమ అభిమాన దర్శకుడు... రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చాడన్న వార్తతో అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. రాజమౌళిని చూసేందుకు పోటీలు పడ్డారు.