: మెమన్ పిటిషన్ పై ఈ నెల 27న వాదనలు వింటాం: సుప్రీం
ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 27న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 30న తనకు విధించనున్న ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ మెమన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష పొందేందుకు తనకు న్యాయపరమైన అవకాశాలున్నాయని అందులో పేర్కొన్నాడు. అంతేగాక క్షమాభిక్ష కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ కు కూడా మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని తెలిపాడు. అయితే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి ముందే కింది కోర్టు తనకు డెత్ వారెంట్ జారీ చేయడం చట్ట వ్యతిరేకమన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.