: చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోంది: జీవన్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో పెద్ద వారిని వదిలేసి చిన్న వారిపై విచారణ జరుపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఎవరో మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే సందేహాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని అన్నారు. బాబు, కేసీఆర్ ఇద్దరూ కూడా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతున్న తీరు ఏమాత్రం సరిగా లేదని అన్నారు.