: 5 గంటల్లో 10 కిలో మీటర్లు నడిచిన రాహుల్... అనంతలో ముగిసిన రైతు భరోసా యాత్ర
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర కొద్దిసేపటి క్రితం ముగిసింది. నేటి ఉదయం 8.30 గంటలకు అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకున్నారు. అక్కడినుంచి ఓబుళదేవర చెరువుకు చేరుకున్న రాహుల్ 9 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 10 కిలో మీటర్ల దూరంలోని కొండకమర్లకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అక్కడే ఆయన పాదయాత్రను ముగించారు. 10 కిలో మీటర్ల దూరాన్ని రాహుల్ గాంధీ 5 గంటల్లో పూర్తి చేశారు. పాదయాత్రలో రాహుల్ వెంట ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మహిళా నేత గంగాభవానీ తదితరులున్నారు.