: పది వేల మందికి ప్రమోషన్లు ఇచ్చిన విప్రో, ఉద్యోగుల వేతనాల పెంపు


ఇండియాలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతి సంస్థ విప్రో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్లిచ్చి గౌరవించింది. ప్రతియేటా జూన్, డిసెంబర్ నెలల్లో ప్రమోషన్లు ఇచ్చే విప్రోలో, పనితీరు సంతృప్తికరంగా ఉన్న వారికి 7 నెలల వ్యవధిలో రెండు ప్రమోషన్లు కూడా అందాయని సమాచారం. ఇదే సమయంలో జూనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 15 శాతం, ఇతరులకు సరాసరిన 7 శాతం వరకూ వేతనాలను పెంచినట్టు సంస్థ తెలిపింది. కాగా, విప్రోకు ప్రధాన పోటీదారులుగా ఉన్న టీసీఎస్ లో సరాసరిన 8 శాతం, ఇన్ఫోసిస్ లో 6.5 శాతం మేరకు వేతనాలు పెరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News