: ఐఫోన్-7, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఇవేనట!


ఐఫోన్-6 మార్కెట్లోకి వచ్చేసింది. ఇక స్మార్ట్ ఫోన్ ప్రేమికులు తదుపరి వచ్చే ఐఫోన్ వర్షన్ ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలుపెట్టారు. ఐఫోన్-7 ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఐఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్ల వివరాలివి... * కొత్త ఫైఫోన్ లో మరింత మెరుగైన 12 ఎంపీ కెమెరా ఉంటుందని, ఇది 4కే రెజల్యూషన్ తో వీడియోలను చిత్రీకరించేందుకు అనువుగా ఉంటుందని, సెల్ఫీ కెమెరా సైతం ఫ్లాష్ తో వస్తుందని తెలుస్తోంది. స్క్రీన్ పై మరింత గట్టిగా టచ్ చేయడం ద్వారా కొత్త ఫీచర్లు విడుదల కానున్నాయి. వీడియో తీస్తూనే నచ్చిన ఫ్రేమ్ ఫోటోను తీయడం వంటి సదుపాయాలు ఉంటాయట. * ఐఫోన్-7లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుందని, దీని ద్వారా మరింత అధిక సమయం పాటు ఫోన్ ను వాడుకోవచ్చని సమాచారం. * ఫోన్ డిజైన్ లో స్వల్ప మార్పులుంటాయని, కెమెరా ఉన్న చోట అద్దం దెబ్బతినకుండా కొంచెం వంపు వుంటుందని సమాచారం. * ఇప్పటివరకూ యాపిల్ ఫోన్లు గ్రే, సిల్వర్, గోల్డ్ రంగుల్లో లభిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. కొత్త ఫోన్ మరిన్ని రంగులతో వస్తుందట. గతంలో ఉన్న 4.7 అంగుళాలు, 5.5 అంగుళాల స్క్రీన్ వర్షన్లలోనే కొనసాగుతుంది. * ఈ సంవత్సరం జూన్ లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో ప్రజల ముందుకొచ్చిన ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ లో వచ్చే ఐఫోన్-7లో మరికొన్ని సాఫ్ట్ వేర్ మార్పులుంటాయని, హార్డ్ ప్రెస్ ప్రత్యేక ఫీచర్ గా మారుతుందని తెలుస్తోంది. * ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న ఐఫోన్లతో పోలిస్తే, 30 శాతం వేగంగా పనిచేసే టచ్ ఐడీ సెన్సార్ ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై యాపిల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

  • Loading...

More Telugu News