: టీఆర్ఎస్ పాలనపై స్పందించిన విజయశాంతి
తనకు తిరిగి టీఆర్ఎస్ లో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటి విజయశాంతి స్పష్టం చేశారు. ఈ మేరకు పత్రికల్లో వస్తున్న కథనాలను ఆమె ఖండించారు. ఇకపై కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని... వారి పాలన ఎలా కొనసాగుతోందన్న దానిపై ఓ అంచనాకు రావడానికి కొంత టైమ్ పడుతుందని చెప్పారు. పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు అనుకునేంత వరకు విమర్శలు చేయకుండా వేచి ఉండాలని అన్నారు.