: రుద్రమదేవి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన గుణశేఖర్
అనుష్క, రానా, అల్లు అర్జున్ తదితరులు నటించగా, దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం 'రుద్రమదేవి' విడుదల తేదీని ప్రకటించారు. సప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తామని గుణశేఖర్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయని, రుద్రమదేవి భర్తగా రానాను సరికొత్త రీతిలో ప్రేక్షకులు చూడనున్నారని అన్నారు. ఈ సినిమా కోసం పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారని, వారందరి కృషి తెరపై కనిపిస్తుందని వివరించారు. అనుష్క మాట్లాడుతూ, 13, 14 శతాబ్దాల కాలంలో ఉంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు వివరిస్తుందని తెలిపారు.