: బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్సు... 40 మందికి గాయాలు


మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో ఓ టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 50 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా డిపోకు చెందిన బస్సు బాసర నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News