: సరికొత్త ఆండ్రాయిడ్ యాప్... ఇకపై వర్టికల్ వీడియోలను ఫుల్ సైజులో చూడవచ్చు!
స్మార్ట్ ఫోన్లలో తీసే వర్టికల్ వీడియోలను ఆపై చూడాలని భావించి ఇబ్బందులు పడటం అందరు యూజర్లకు అనుభవమే. ఇకపై ఆ కష్టం తీరనుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యూ ట్యూబ్ తన యాప్ ను అప్ డేట్ చేసింది. ఇందులో భాగంగా వర్టికల్ వీడియోలను పోర్ట్ రెయిట్ మోడ్ లో చూసుకోవచ్చు. యూ ట్యూబ్ అందిస్తున్న యాండ్రాయిడ్ యాప్ వర్షన్ 10.28లో ఈ సౌకర్యం లభిస్తుందని సంస్థ తెలిపింది. గతంలో వర్టికల్ మోడ్ లో తీసిన వీడియోలు ప్రీవ్యూ స్క్రీన్ తో పోలిస్తే చిన్నగా కనిపించేవన్న సంగతి తెలిసిందే. వీటిని ఫుల్ స్క్రీన్ ల్యాండ్ స్కేప్ మోడ్ లో పెట్టి, స్మార్ట్ ఫోన్ ను నిలువుగా ఉంచి చూడాల్సిన పరిస్థితి. కాగా, యూ ట్యూబ్ ఐఓఎస్ యాప్ లో మాత్రం ఈ కొత్త అప్ డేట్ లభించదు.