: మ్యాగీ కన్నా ముందు బ్యాన్ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి: బాంబే హైకోర్టు వ్యాఖ్య
ఇండియాలో అమ్మకపు నిషేధాన్ని ఎదుర్కొంటున్న మ్యాగీ ఉత్పత్తుల కన్నా డేంజర్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తమపై నిషేధం అక్రమమని నెస్లే వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తులు, మ్యాగీ కన్నా ముందు మద్యం ఉత్పత్తులను నిషేధించాల్సి వుందని అన్నారు. చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలుగా మారుతుండడం అత్యంత ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. మద్యం వల్ల ఎంతో మంది ఆరోగ్యం దెబ్బతింటోందని హైకోర్టు జడ్జీలు వీఎం కరాడే, వీపీ కోలబావాలాలు వ్యాఖ్యానించారు. వరుసగా రెండు రోజుల పాటు నెస్లే పిటిషన్ పై వాదనలు జరుగగా, మ్యాగీతో ఎటువంటి అనారోగ్యమూ కలగదని నెస్లే కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు.