: దేశవ్యాప్తంగా జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలన్నింటికీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ లాకప్పుల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేయాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జైళ్లలో సంస్కరణలు, రాష్ట్రాల హెచ్ ఆర్సీల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ దిలీప్ కె.బసు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం పైవిధంగా తీర్పు వెల్లడించింది. సంవత్సరం లోపులోనే కెమెరాలు ఏర్పాటు కావాలని, ప్రతి పోలీస్ స్టేషన్ లో కనీసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని నిర్దేశించింది. మూడు నెలల్లోపు రాష్ట్రాలన్నింటిలోని హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లో ఖాళీలను భర్తీ చేయాలని తీర్పు సమయంలో జస్టిస్ ఠాకూర్ తెలిపారు. ఇదే సమయంలో ఢిల్లీ సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా హెచ్చార్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు