: రైల్వే పోలీసు కక్కుర్తితో ఫెన్సింగ్ చాంపియన్ దుర్మరణం


ఒక రైల్వే పోలీసు లంచాల కక్కుర్తి జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ చాంపియన్ నిండు ప్రాణాలను బలిగొంది. రూ. 200 లంచం ఇవ్వలేదని ఆ అథ్లెట్ ను రైలు నుంచి కిందకు తోసివేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, యూపీకి చెందిన ఫెన్సింగ్ చాంపియన్ హోషియార్ సింగ్ తన సొంత గ్రామం వెళ్లి తల్లి, భార్యతో తిరిగివస్తూ, రిజర్వేషన్ లభించక వారిద్దరినీ లేడీస్ కోచ్ లో కూర్చోబెట్టి, తాను వేరే బోగీలోకి ఎక్కాడు. మార్గమధ్యంలో తన భార్యకు సుస్తీగా ఉందని తెలుసుకుని లేడీస్ కంపార్ట్ మెంటులోకి వచ్చాడు. దీన్ని చూసిన రైల్వే పోలీసు రూ. 200 ఇస్తేనే ఆ బోగీలో ఉండనిస్తానని చెప్పాడు. అందుకు నిరాకరించడంతో, నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. కళ్లముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో హోషియార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా, ఈ విషయంలో పోలీసుల కథనం మరోలా వుంది. మంచినీళ్ల కోసం కిందికి దిగి, కదులుతున్న రైల్లోకి ఎక్కే ప్రయత్నంలోనే కాలుజారి ఆయన మరణించాడని చెబుతున్నారు. రైల్వే పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News