: ఐపీఎల్ ను నిషేధించండి!... మోదీకి నల్లగొండ ఎంపీ గుత్తా లేఖ


కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నిన్న ఓ లేఖ రాశారు. విశేష ప్రజాదరణ పొందిన ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)’ను నిషేధించాలని సదరు లేఖలో గుత్తా ప్రధానిని కోరారు. భారత క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ‘‘స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బీసీసీఐ కొందరి చేతుల్లోనే ఉంది. ఇది మంచిది కాదు. జాతీయ క్రికెట్ సంస్థకు అనుబంధంగా బీసీసీఐ ఏర్పడింది. అందులోని కార్యవర్గంలో ఎక్కువ కార్పొరేట్లు, రాజకీయ నాయకులే ఉన్నారు. వీరిని రాష్ట్ర స్థాయి క్రికెట్ అసోసియేషన్లు ఎన్నుకుంటున్నాయి. దీంతో బీసీసీఐలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా పోయింది’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డులో వివాదాల గురించి తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, ప్రసార హక్కుల ద్వారా వచ్చే డబ్బు, ఇతర ఖర్చుల వ్యవహారం తీవ్ర అవినీతిమయమైందని కూడా ఆ లేఖలో గుత్తా ఆరోపించారు.

  • Loading...

More Telugu News