: నేడే రాహుల్ ‘అనంత’ పాదయాత్ర... సాయిబాబా సమాధి సందర్శించనున్న యువనేత
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఆయన మరికాసేపట్లో రోడ్డు మార్గం మీదుగా అనంతపురం జిల్లా చేరుకోనున్నారు. ఓబుళదేవర చెరువు నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రలో రాహుల్ 10 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు తదితర వర్గాలను రాహుల్ పలకరించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు. మూడు విడతలుగా జరగనున్న రాహుల్ పాదయాత్ర నేటి సాయంత్రానికి పుట్టపర్తి చేరుకోనుంది. అక్కడ సత్యసాయిబాబా సమాధిని సందర్శించుకున్న అనంతరం యాత్రను ముగించుకుని రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా నుంచి తిరుగు పయనమవుతారు.