: ప్రభాస్ 'నాన్', అనుష్క 'కర్రీ'.... నోరూరిస్తున్న ‘బాహుబలి' మెనూ!


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను బద్దలు కొడుతోంది. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రపంచంలోనే భారీ పోస్టర్ గానూ ఈ చిత్రానికి చెందిన ఓ పోస్టర్ గిన్నీస్ రికార్డెక్కింది. తాజాగా నోరూరించే ‘మెనూ’గానూ ‘బాహుబలి’ ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో ‘బాహుబలి' మెనూ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ మెనూలో వెజ్ ప్యాక్ ధర రూ.200 అయితే, నాన్ వెజ్ ప్యాక్ రూ.300 అట. ఇక ఈ మెనూ లోని ఐటమ్స్ విషయానికొస్తే... ఎస్ఎస్ రాజమౌళి డ్రై ఐటమ్, ప్రభాస్ నాన్, అనుష్క కర్రీ, రానా రైస్, తమన్నా డ్రింక్స్.. తదితర వంటకాలు ఉన్నాయట. ఈ ఐటమ్స్ నోరూరిస్తున్నాయని నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News