: కాలు జారి కాలువలో పడిన దేవినేని ఉమ
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రమాదం తప్పింది. ఆయన గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం వద్ద పోలవరం కుడి కాల్వ పనుల పరిశీలనకు విచ్చేశారు. కాలువ పనులపై అధికారులతో మాట్లాడుతూ ముందుకుసాగుతున్న ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. మంత్రి కాలువలో పడిపోవడాన్ని గమనించిన అధికారులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించారు. ఆయనను భద్రంగా బయటికి లాగారు. మంత్రి క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.