: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా రమణారావు నియామకం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా వి.వి.రమణారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ జేఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 1న ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.