: నవాజ్ షరీఫ్ కు ఒబామా ఆహ్వానం... పొంగిపోతున్న పాక్ వర్గాలు


బరాక్ ఒబామా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆసియా దేశాల పట్ల అమెరికా వ్యూహాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, భారత్, పాకిస్థాన్ దేశాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. ఈ క్రమంలో ఒబామా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను అమెరికా రావాలంటూ ఆహ్వానించారు. అక్టోబరు చివరి వారంలో తమ దేశంలో పర్యటించాలని సందేశం పంపారు. ఒబామా ఆహ్వానం నేపథ్యంలో పాకిస్థాన్ వర్గాలు పొంగిపోతున్నాయి. తమ విధానాలకు అమెరికా మద్దతిస్తోందనడానికి ఈ ఆహ్వానమే రుజువు అని పాక్ పీఎంవో చెబుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల కోసం షరీఫ్ సెప్టెంబరులో అమెరికా వెళ్లాల్సి ఉందని, ఈలోపే ఒబామా ఆహ్వానించారని తెలిపింది. ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని పీఎంవో అధికారులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News