: 'యాపిల్' అమ్మకాలు చైనాలో కంటే భారత్ లోనే ఎక్కువ!
'యాపిల్' సంస్థ ఉత్పత్తుల కొనుగోలులో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్స్, ఐప్యాడ్స్, మాక్ కంప్యూటర్స్ వంటి పరికరాల కొనుగోళ్లలో భారత్ చైనాను మించిపోయింది. యాపిల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చైనాలో 87 శాతం అమ్మకాలు జరుగగా, భారత్ లో 93 శాతం అమ్మకాలు జరిగాయని పేర్కొంది. గతేడాది ఐఫోన్-6ను భారత మార్కెట్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి యాపిల్ అమ్మకాలు జోరందుకున్నాయని ఆ సంస్థ పేర్కొంది.