: నకిలీ డిగ్రీ పట్టా కేసులో ఆప్ నేతకు బెయిల్


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదనపు సెషన్స్ జడ్జి విమల్ కుమార్ యాదవ్ షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చారు. అంతేగాక రూ.5,000 స్యూరిటీగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఢిల్లీ దాటి వెళ్లకూడదని, విచారణకు ఎప్పుడు పిలిచినా వెంటనే హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. బీహార్ లోని ఓ కళాశాల నుంచి నకిలీ డిగ్రీ పట్టా కలిగి ఉన్నారంటూ ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు చేయడంతో జూన్ 9న తోమర్ ను అరెస్టు చేశారు. ఆ తరువాత రెండుసార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. మళ్లీ పిటిషన్ వేయగా దానికి సంబంధించి ఈరోజు వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News