: నాగార్జున వర్సిటీ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ సస్పెన్షన్
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం, బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో ప్రిన్సిపల్ బాబూరావు సస్పెండ్ అయ్యారు. ఆత్మహత్య ఘటనపై స్పందించిన ఏపీ ఉన్నత విద్యామండలి స్పందించి ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బాబూరావు వైఖరిపై పోలీసులతో బాటు, నిజనిర్ధారణ కమిటీ విచారణ చేస్తోంది. ఈ నెల 14న యూనివర్సిటీలోని హాస్టల్ లో రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాంగింగ్ కారణంగానే ఆమె ఇలా చేసిందని అంతా భావించారు. తరువాత పలు విషయాలు బయటికి రావడంతో ఇది హత్యేనని, సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.