: డియర్ లెఫ్టినెంట్ గవర్నర్... ఎక్కడన్నా ఒక వ్యక్తి గవర్నమెంట్ కాగలడా?: కేజ్రీవాల్ సూటి ప్రశ్న
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటైన లేఖ రాశారు. కేవలం ఒక వ్యక్తి తనను తాను ప్రభుత్వమని ఎలా చెప్పుకోగలడని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఎల్జీ, కేజ్రీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అధికారిణి విషయంలోనూ వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. రాజ్యాంగపరంగా గవర్నమెంట్ అనే పదానికి నిర్వచనం కూడా తెలియకుండా, తానొక్కడినే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు జంగ్ భావిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మోదీ అనుకూల పవనాలు దేశమంతటా వీస్తున్న సమయంలో బీజేపీని మట్టి కరిపిస్తూ, కేజ్రీవాల్ ఘనవిజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని రెండోసారి అధిరోహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికారుల నియామకాల్లో ప్రజాప్రతినిధులు, ఎల్జీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.