: చైనా పంథా మార్చుకుంటోంది!


బలమైన రాజకీయ సిద్ధాంతాలకు నిలయమైన కమ్యూనిస్టు చైనా తన పంథా మార్చుకుంటోందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి వార్తా పత్రికలు. ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ స్థానం కలిగిన చైనా, జనాభా సమస్యను దృష్టిలో పెట్టుకుని 'ఒకరు ముద్దు, లేదా వద్దు' అనే సిద్ధాంతం ప్రచారం చేసింది. దీనిని ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం అందించే పథకాలు, సౌకర్యాలలో కోత విధిస్తామని అప్పట్లో పేర్కొంది. దీంతో చైనీయులు ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. సుదీర్ఘకాలం దీనికి కట్టుబడి ఉన్న చైనీయులు రెండో బిడ్డకోసం పరితపిస్తున్నారు. దీంతో తమకు రెండో బిడ్డను కనాలని ఉందని, అందుకు అనుమతించాలంటూ అక్కడి ప్రభుత్వానికి దంపతులు అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో సుదీర్ఘ కాలంగా అమలవుతున్న నిబంధనను సడలించే అవకాశం ఉందని అక్కడి వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. దీనిపై నిర్వహించిన ఆన్ లైన్ పోల్స్ లో కూడా ఎక్కువమంది చైనీయులు రెండో బిడ్డ సిద్ధాంతానికి మద్దతిచ్చారు. దీనిపై కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలో యువ జంటలు మాత్రం ఈ డిమాండ్ పై మక్కువ చూపకపోవడం విశేషం. కాగా, ఈ నిబంధన సడలించేందుకు చైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు వార్తా పత్రికలు తెలిపాయి.

  • Loading...

More Telugu News