: జైల్లో మెమన్ ను కలసిన భార్య, కుమార్తె, బంధువులు


ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ నాగపూర్ కేంద్ర కారాగారంలో కుటుంబ సభ్యులతో గడిపాడు. త్వరలో ఉరిశిక్ష అమలు చేయనుండటంతో అతనిని కలిసేందుకు భార్య రాహిన్ మెమన్ (42), కుమార్తె జుబేదా(21), బంధువు ఇక్బాల్ మెమన్, మరికొంతమంది ఈ ఉదయం ముంబయి నుంచి రైలులో నాగ్ పూర్ వచ్చారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని మెమన్ వద్దకు తీసుకెళ్లారు. దాదాపు గంటకు పైగా మెమన్ తన కుటుంబసభ్యులతో గడిపాడని సమాచారం. తొమ్మిదిన్నర సమయంలో వారు లోపలికి వెళ్లగా 11 గంటల సమయంలో బయటికి వచ్చినట్టు తెలిసింది. అయితే అతన్ని కలవాలని కుటుంబసభ్యులు ఈ నెలలో మొదట్లోనే ప్లాన్ చేసుకున్నారని, అందుకోసం 4వ తేదీన టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు జైలు అధికారుల ద్వారా తెలిసింది.

  • Loading...

More Telugu News