: కమీషన్ల కోసమే తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు: దాసోజు శ్రవణ్
టీఆర్ఎస్ ఓ కమీషన్ల పార్టీ అని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఆ కమీషన్ల కోసమే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులన్నీ తీసుకొస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు కొత్త ప్రాజెక్టులపై ఉన్న ప్రేమ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై లేదని శ్రవణ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పై ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ ను తుమ్మిడిహెట్టి నుంచి పోనివ్వమని స్పష్టం చేశారు.