: ఎవరీ కుర్రాడు?... అచ్చు కోహ్లీలా ఉన్నాడే!: ట్విట్టర్లో చర్చనీయాంశం


ఏమీ చేయకుండానే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. వివరాల్లోకెళితే... ట్విట్టర్ లో ఇప్పుడో ఫొటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి అచ్చుగుద్దినట్టు కోహ్లీలా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ జెర్సీ ధరించి, కోహ్లీ తరహాలో కళ్లు పెద్దవి చేసి తీక్షణంగా చూస్తున్నాడా ఫొటోలో. కాగా, అతడో పాకిస్థానీ కుర్రాడు. పేరు తెలియరాలేదు కానీ, అతడిప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ ఫొటోను భారత్, పాకిస్థాన్ దేశాల్లో పెద్ద సంఖ్యలో షేర్ చేసుకుంటున్నారట. అంతేగాదు, కోహ్లీ వంటి ఆటగాడు లేడని బాధపడుతున్న పాక్ జట్టుకు ఇప్పుడు కోహ్లీ దొరికాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీలా ఉండడంతో అతడికి టీవీ చాన్సులు, అడ్వర్టయిజ్ మెంట్ అవకాశాలు వస్తున్నాయని పాక్ మీడియా తెలిపింది.

  • Loading...

More Telugu News