: చంద్రబాబు ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇస్తున్నాం: జగన్


ఏపీలో కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల సమయం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈలోగా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరించారు. పద్నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా సీఎంకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న సమయంలో జగన్ పైవిధంగా మాట్లాడారు. రేపు జరిగే మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులు గుండెపోటుతో చనిపోయారని ఆరోపించారు. జీతాలు పెంచమంటే కార్మికులను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News