: ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన కేసీఆర్
హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా, ఆసుపత్రి పరిసరాలు, ఆవరణతో పాటు ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పాత భవనం స్థానంలో కొత్త భవనం కడతామని ఇటీవలే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసుపత్రిని సందర్శించారు. కొత్త భవన నిర్మాణం సాధ్యాసాధ్యాలను అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీ స్థలం ఎంత ఉందని ఈ సందర్భంగా అధికారులను ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఒక నివేదిక అందజేయాలని కోరారు.