: టాప్ 500 కంపెనీల్లో ఇండియావి 7 మాత్రమే!


ఫార్చ్యూన్ మేగజైన్ ప్రకటించిన వరల్డ్ టాప్ -500 కంపెనీల్లో ఇండియాకు చెందిన 7 కంపెనీలకు మాత్రమే చోటు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం 62 బిలియన్ డాలర్ల ఆదాయంతో రిలయన్స్ 158వ స్థానంలో, 42 బిలియన్ డాలర్ల ఆదాయంతో టాటా మోటార్స్ 254వ స్థానంలో నిలిచాయి. వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఓఎన్జీసీలు జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. ఈ లిస్టులో వాల్ మార్ట్ తొలి స్థానంలో నిలిచింది. టాప్ - 500 కంపెనీల ఆస్తుల విలువ 31.2 ట్రిలియన్ డాలర్లని, ఈ కంపెనీలు 2014లో 1.7 ట్రిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేశాయని ఫార్చ్యూన్ ప్రకటించింది. వాల్ మార్ట్ తరువాత టాప్ 5 స్థానాల్లో చైనాకు చెందిన సినోపెక్ గ్రూప్, నెదర్లాండ్స్ కు చెందిన రాయల్ డచ్ షెల్, చైనాకు చెందిన నేషనల్ పెట్రోలియం, ఎక్సన్ మొబిల్ లు నిలిచాయి. యూఎస్ కు చెందిన 128 కంపెనీలు, చైనాకు చెందిన 100 కంపెనీలు టాప్ 500 లిస్టులో ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News