: ఇండియాలో ఆరు కొత్త టూరిజం వలయాలు!


దేశంలో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా ఆరు కొత్త టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న టూరిజం శాఖ మంత్రి మనీష్ శర్మ ఈ విషయాన్ని వివరించారు. వీటి బ్లూప్లింట్ సిద్ధమైందని అన్నారు. రామాయణ, డెజర్ట్, ఎకో, వైల్డ్ లైఫ్, రూరల్ సర్క్యూట్లు ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు. వీటితో పాటు బుద్ధిజం, జైన్, సుఫి సర్క్యూట్లను సైతం ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. అండమాన్ దీవుల్లోని బీచ్ లు ప్రపంచంలోనే ఉత్తమమైనవని, మన హిమాలయాలు సైతం అంతేనని గుర్తు చేసిన శర్మ, ఇండియన్స్ మాత్రం మంచుకొండలు, బీచ్ ల కోసం విదేశీ యాత్రలు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News