: పవన్ కల్యాణ్ లాంటోళ్ల నోరు మూయించడానికే కంటితుడుపు చర్యలు: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈసారి ఆయన సొంత పార్టీ ఎంపీల వైఖరిని ఎండగట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నేడు తెలుగుదేశం ఎంపీలు ధర్నా నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇవన్నీ కంటితుడుపు చర్యలేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ వంటి వాళ్ల నోళ్లు మూయించడానికే ఇటువంటివి తెరపైకి వస్తాయని ఆయన అన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని ఎద్దేవా చేశారు.