: బజరంగి భాయిజాన్ పై రాజమౌళి స్పందన


సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయిజాన్' చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాపై టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి ట్విట్టర్లో స్పందించారు. సల్మాన్ తన స్టార్ ఇమేజ్ ను పక్కనబెట్టి కథకే ప్రాధాన్యం ఇచ్చాడన్న విషయం ఈ సినిమాలో ప్రస్ఫుటమైందని అన్నారు. చిన్నారి హర్షాలి అద్భుతమైన అభినయాన్ని కనబర్చిందని కొనియాడారు. ఆ బాలిక నటన అందరినీ అలరించిందని తెలిపారు. తారాగణం కన్నా కథనే పైమెట్టుపై నిలిపేందుకు యూనిట్ పడ్డ శ్రమ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, చిత్ర కథ హృదయానికి హత్తుకుందని అన్నారు. ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News